రైలును ఎక్కబోయి జారిపడిన వ్యక్తి.. కానిస్టేబుల్ సేవ్!
AP: అనంతపురం జిల్లాలో కదులుతున్న రైలును ఎక్కబోయి జారిపడిన వ్యక్తిని ఓ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో కాపాడారు. అనంతపురంలోని రైల్వే స్టేషన్‌లో భైరవ నగర్‌కు చెందిన రవికుమార్ రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తూ జారిపడ్డాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేంద్ర సమయస్ఫూర్తితో అతని చొక్కా పట్టుకొని పక్కకు లాగాడు. దీంతో రవికుమార్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన గత నెల 29న జరగగా.. తాజాగా సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

