నీరులేని వాగుల్లో నిమజ్జనం.. వినాయకా మన్నించు

కడప జిల్లాలో ఎల్ నినో కారణంగా వర్షాలు పడలేదు. వినాయక నిమజ్జనం సమయానికి వర్షం వస్తుందని ప్రజలు ఆశపడ్డారు. కానీ ఆ ఆశ నెరవేరలేదు. వారం రోజుల పాటు పూజలు, అన్నదానాలు, భజనలతో వినాయకుడిని కొలిచారు. చివరికి గంగ ఒడిలో చేరాల్సిన స్వామి, నీరు లేని వాగుల్లో, చెరువుల్లో నిమజ్జనం కావాల్సిన పరిస్థితి. కడప జిల్లా పులివెందులలో ఈ పరిస్థితి నెలకొంది.




