పారామెడికల్ విద్యార్థులపై పోలీస్ దాడిపై SFI ఆగ్రహం

తిరుపతి జిల్లా అలిపిరిలో పారామెడికల్ విద్యార్థులపై పోలీసులు దాడి చేశారు. శాంతియుత ఆందోళనలో ఉన్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని SFI ఆగ్రహం వ్యక్తం చేసింది. నెలకు రూ.15,000 స్టైఫండ్ ఇవ్వాలని, ఇంటర్న్‌షిప్ కాలాన్ని ఆరు నెలలకు పరిమితం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలిపిరిలో నిరసన సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. SFI జిల్లా నాయకురాలు సునీత జుట్టు పట్టుకొని లాకెళ్లడం సరికాదంది. విద్యార్థులతో చర్చించాలని డిమాండ్ చేసింది.



