మందకృష్ణను కలిసిన MRPS, MSP నాయకులు

మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం నేరేడు గ్రామంలో మహాజన సోషలిస్ట్ పార్టీ (MSP) రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు రజియా తండ్రి కర్మక్రియలకు MRPS, MSP వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హాజరై కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా గార్ల మండలానికి నూతనంగా ఎన్నికైన MRPS అధ్యక్షుడు బాషా పంగు జయరాజ్, MSP మండల అధ్యక్షుడు కొత్తపల్లి వెంకన్న, MRPS జిల్లా సీనియర్ నాయకుడు పుట్టల వెంకటేశ్వర్లు తదితరులు మందకృష్ణ మాదిగను మర్యాదపూర్వకంగా కలిశారు.


