జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం

మెదక్ పట్టణంలోని 20వ వార్డులో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాలనీలు, ప్రధాన రహదారులపై కుక్కలు సంచరిస్తుండటంతో చిన్నారులు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారని స్థానికులు తెలిపారు. కుక్కల బెడదను నియంత్రించేందుకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా భద్రత కల్పించాలని కోరుతున్నారు.



