పొట్టకూటి కోసం ప్రాణాలతో చెలగాటం

సిద్దిపేట జిల్లా బెజ్జంకి బస్టాండ్లో చత్తీస్గఢ్కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక అనుష్క సాహస విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. సుమారు 10మీటర్ల ఎత్తులో కట్టిన తాడుపై తలపై కుండలు ఎత్తుకుని, చేతిలో పొడవాటి కర్రతో శరీరాన్ని సమతుల్యం చేసుకుంటూ నడిచింది. చిన్నారి ప్రతిభను అభినందించిన మాజీ సర్పంచ్ రావుల నరసయ్య నగదు బహుమతితో పాటు శాలువాతో సత్కరించారు. పొట్టకూటి కోసం చిన్నారులు ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేయడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


