మీ చిన్ననాటి జ్ఞాపకాలనే.. పిల్లలతో రిపీట్ చేస్తున్నారా?

చిన్నప్పుడు పేరెంట్స్‌తో చేసిన పనులనే.. ఇప్పుడు చాలామంది తమ పిల్లలతోనూ చేస్తున్నారు. ఫ్యామిలీ ట్రిప్స్, బర్త్‌డే స్పెషల్, ఫేవరెట్ ఫుడ్, నిద్రకు ముందు కథలు.. ఇలా చిన్న చిన్న ఫ్యామిలీ ట్రెడిషన్స్ పిల్లలకు కుటుంబంతో మంచి అనుబంధాన్ని పెంచుతాయట. “నేను ఈ కుటుంబంలో ఒక భాగం” అనే భావన పిల్లల్లో పెరగడంతో పాటు.. వారి వ్యక్తిత్వం, కుటుంబంతో అనుబంధంపైనా ఈ జ్ఞాపకాలు ప్రభావం చూపుతాయని సైకాలజీ చెబుతోంది.



