KBC షూటింగ్‌లో అమితాబ్‌కు గాయం

బాలీవుడ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) షూటింగ్‌లో గాయపడ్డారు. ప్రోగ్రాం షూటింగ్ టైంలో తాను జారి పడటంతో మోకాలికి గాయం అయినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం KBC 18వ సీజన్ జరుగుతుంది. సాధారణంగా షో స్టార్టింగ్ లో స్టేజ్ మధ్యలో నిల్చొని కంటెస్టెంట్లకు అమితాబ్ వెల్కమ్ చెబుతారు. అదే టైంలో ప్రమాదం జరిగినట్లు ఆయన రీసెంట్ ఎపిసోడ్ లో తెలిపారు. గాయం కారణంగా ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందారు.



