మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా: వేతనం పెంచాలి

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో ఎఐటియుసి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నా చేశారు. విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ ధర్నాలో పెండింగ్ మెస్ చార్జీలు, కేంద్రం ఇచ్చే రూ.1,000 వేతనం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని, రూ.10 వేల వేతనం, ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాదబీమా, ఉద్యోగభద్రత కల్పించాలని కోరారు. నేత నిమ్మటూరి రామకృష్ణ ఈ డిమాండ్లను వివరించారు. అనంతరం ఎంఈఓకు వినతిపత్రం సమర్పించారు.




