రామగుండంలో పారిశుద్ధ్య యంత్రాలు మూలన

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వెనుక పారిశుద్ధ్య యంత్రాలు మూలన పడి ఉన్నాయి. CPI ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య వాటిని పరిశీలించారు. అప్పటి ఐఏఎస్ కమిషనర్ రూ.2 కోట్లతో అత్యాధునిక యంత్రాలు కొనుగోలు చేశారని, ఏడాది పాటు వాహనాలు రాలేదని తెలిపారు. AIYF, ప్రజా సంఘాల పోరాటంతో వాహనాలు వచ్చినా అవి నాసిరకంగా ఉండటంతో కొన్ని రోజుల్లోనే మూలన పడ్డాయన్నారు. ప్రజల సొమ్ము వృథా అవుతోందని, కమిషనర్, మేయర్ స్పందించాలని డిమాండ్ చేశారు.



