← Back to news

అలయ్ బలయ్‌కి.. ఏర్పాట్లు షురూ

By Prashanth· 3h ago
అలయ్ బలయ్‌కి.. ఏర్పాట్లు షురూ

TG: దసరా సందర్భంగా ఈనెల 22న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 22వ అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. అలయ్ బలయ్ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సహా మరికొంత ప్రముఖులు అటెండ్ అవుతారని తెలిపారు.

More in TG