NIMSలో OP టైమింగ్స్ పెంపు..

TG: హైదరాబాద్ NIMS హాస్పిటల్లో OP రిజిస్ట్రేషన్ల టైం మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించారు. గతంలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకే రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఈ నిర్ణయంతో దూరప్రాంతాల నుంచి వచ్చే పేషంట్స్కి ప్రయోజనం కలగనుంది. MRI కాకుండా ఇతర మెడికల్ టెస్టులు అదే రోజు టెస్ట్ చేసి, ఒకటి రెండు గంటల్లోనే రిపోర్టులు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పేషంట్స్ అదే రోజు డాక్టర్లను సంప్రదించి చికిత్స పొందవచ్చు. డాక్టర్లు సాయంత్రం వరకు అందుబాటులో ఉండనున్నారు.

