నీట్‌లో సత్తా.. వరుసగా అక్కాచెల్లెళ్లకు వైద్య సీట్లు

మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం రుక్కంపల్లి గ్రామానికి చెందిన జుర్కి సాయి ప్రియ నీట్‌లో ప్రతిభ కనబరిచి చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఆమె అక్క జుర్కి సాత్విక గతేడాది వికారాబాద్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు వరుసగా రెండేళ్లలో వైద్య విద్యలో సీట్లు సాధించారు. సీనియర్ పాత్రికేయులు జుర్కి వెంకట్‌రాములు, విజయలక్ష్మి దంపతుల కుమార్తెల విజయంపై గ్రామస్తులు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.



