ప్రైవేట్ స్కూల్ ఫీజులతో Parentsకు భారం

TG: TPF ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పెద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద బస్సు యాత్ర ప్రారంభించారు. పేరెంట్స్ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజుల వల్ల చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ రీఓపెన్ కాగానే ఫీజులు కట్టేందుకు ప్రతి ఇంట్లో డబ్బుల కోసం ఇబ్బందులు, గొడవలు మొదలవుతున్నాయని తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



