← Back to news

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఉద్రిక్తత

By DK· 5h ago

TG: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి రావడంతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో తీవ్ర కలకలం రేపింది. చిన్నారికి మేనమామ వరుసయ్యే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించే క్రమంలో స్థానికులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in TG