వర్షంతో కూల్ వైబ్స్.. కానీ ఫుల్ ట్రాఫిక్

కర్నూలు జిల్లా ఆదోనిలో ఇవాళ భారీ వర్షం కురిసింది. ఎండలతో అల్లాడుతున్న జనానికి మూడు గంటల వానతో వాతావరణం చల్లబడింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు నీట మునిగాయి. రైతు బజార్లో మోకాళ్ల లోతు నీరు చేరడంతో కూరగాయలు కొనేవారు ఇబ్బంది పడ్డారు. రైల్వే స్టేషన్ రోడ్డుపై నీళ్లు నిలవడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది.



