← Back to news

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

By BOLAGANI SAIDULU· 1d ago· Vidyanagar, Suryapet, Suryapet
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో ఎండిపోయిన పంట పొలాలను గ్రామీణ పేదల సంఘం జిల్లా కన్వీనర్ కొనకంచి వీరభద్ర ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు లేక చెరువులు, కుంటలు, బోరుబావులు ఎండిపోయాయని తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీరు, సాగునీటి కొరత ఏర్పడిందన్నారు. జూలైలో కురిసిన కొద్దిపాటి వర్షాలను నమ్ముకుని సాగు చేసిన పత్తి, పెసర, కంది పంటలు వర్షాలు లేక ఎండిపోయాయని చెప్పారు.

More in Local