తెలంగాణకు భారీ వర్షాలు.. 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్!

TG: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు మరో 15 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గత 24 గంటల్లో ఆసిఫాబాద్ రెబ్బెనలో అత్యధికంగా 9.35 సెం.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతుండటంతో అధికారులు నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.

