తాళ్లపేట దుర్గామాతను దర్శించుకున్న జగన్

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలోని దుర్గామాత ఆలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంథన జగన్ మోహన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, సర్పంచులు కళావతి, రాజవ్వ, ఉప సర్పంచులు పుట్టపాక తిరుపతి, ప్రభాకర్, సీనియర్ నాయకులు చీటి సత్యం రావు, ముత్తే రాజన్న, సునీల్ తదితరులు పాల్గొన్నారు.




