LCM అద్వర్యం లో బియ్యం పంపిణీ
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడులో 55మంది పాస్టర్లకు బియ్యం పంపిణీ చేశారు. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల, కడప జిల్లాలకు చెందిన పాస్టర్లకు ఒక్కొక్కరికి 22 కిలోల చొప్పున బియ్యాన్ని అందజేశారు. LCM స్చచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో, డైరెక్టర్ హనోక్ పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బ్రదర్ రమేష్ బుక్క, బ్రదర్ సొలొమోన్ పాల్గొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాస్టర్లకు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పంపిణీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.



