ఢిల్లీ పోలీస్ Vs సుప్రీంకోర్టు- జ్ఞానేష్ కుమార్ వివాదం

CEC జ్ఞానేష్ కుమార్‌పై వచ్చిన అరోపణల నేపథ్యంలో ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసనలు, మార్చ్ నిర్వహించేందుకు ఢిల్లీ పోలీస్ పర్మిషన్ ఇవ్వడం లేదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణకు లిస్ట్ చేస్తామని CJI సూర్యకాంత్ బెంచ్ తెలిపింది. ప్రొటెస్ట్స్ చేసుకునేలా ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు.


