← Back to news

16 ఏళ్ల బాలికతో రోబో అసభ్య ప్రవర్తన.. ఓనర్ అరెస్ట్!

By Nani Eluri· 23h ago· Newsbytesapp
16 ఏళ్ల బాలికతో రోబో అసభ్య ప్రవర్తన.. ఓనర్ అరెస్ట్!

జర్మనీలోని కొలోన్‌లో 16 ఏళ్ల బాలికకు వింత అనుభవం ఎదురైంది. ఫ్రెండ్స్‌తో ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్ బయట ఉన్న ఆమె దగ్గరకు ఓ రోబో వెనుక నుంచి వచ్చి అసభ్యంగా తాకుతూ అనుచితంగా ప్రవర్తించింది. ఈ ఘటనను రోబో ఓనర్ అయిన 16 ఏళ్ల యువకుడు, అతని 19 ఏళ్ల ఫ్రెండ్ వీడియో తీసి సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ చేయడంతో వైరల్ అయింది. దీంతో పోలీసులు రోబోతో పాటు ఫోన్లను స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్ట్ చేశారు. రిమోట్‌తో కావాలనే అలా చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

More in Crime