AI ఫేక్ వీడియోలతో సినీ మహిళలకు టార్చర్!

సినీ ఫీల్డ్లోని మహిళల ఫొటోలు, వీడియోలను AIతో మార్ఫింగ్ చేసి అసభ్యంగా పోస్ట్ చేస్తూ కొందరు వేధిస్తున్నారు. ట్రోలింగ్తో పాటు బెదిరింపులకూ దిగుతున్నారు. జాన్వీ కపూర్, శ్రీలీల, చిన్మయి వంటి వారు ఈ ఆన్లైన్ వేధింపులపై గళం విప్పారు. రిపోర్ట్ చేసినా వేరే అకౌంట్లతో మళ్లీ ఫేక్ కంటెంట్ పోస్ట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పోస్టులపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వెంటనే యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది.


