బహుజనుల హక్కుల కోసం BSPలో చేరికలు

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి వెంకట్రావుపేట గ్రామంలో పలువురు బహుజన్ సమాజ్ పార్టీ (BSP)లో చేరారు. కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి బబ్బిలి అక్షయ్, రాంపల్లి బాలరాజు, మహాతేజా ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించారు. బహుజనుల హక్కుల సాధన, సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తామని కొత్తగా పార్టీలో చేరిన వారు తెలిపారు. గ్రామస్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు చెప్పారు.



