తుపాను కోసం... రాజాంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తీవ్ర తుఫానుగా మారుతోంది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాజాం పురపాలక సంఘం పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 21 రాత్రి నుంచి 24 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి కమిషనర్ రామచంద్ర రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08941-251060. అత్యవసర సహాయానికి ఒక JCB, ఒక డీ వాటరింగ్ పంపు, చెట్లు పడితే కట్ చేయడానికి కట్టర్లు సిద్ధం చేశారు.



