రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా దస్తప్ప

నారాయణపేట జిల్లా రైతు సంఘం 2వ మహాసభల్లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా గుండెగారి దస్తప్ప ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కొత్త ఉద్యమాలు నిర్మించాలని, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ సదుపాయాలు ప్రతి రైతుకూ అందేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. రైతుల భూములపై జరుగుతున్న భూకబ్జాలు, అన్యాయాలను ప్రశ్నిస్తూ, రైతుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలని కోరారు.


