వరద బాధితులకు సాయం అందించాలి: రవిబాబు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, ఇళ్లు, పంటలపై సమగ్ర సర్వే చేపట్టాలని ఎమ్మెల్సీ డా. కుంభా రవిబాబు కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. మారుమూల గిరిజన గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోవడంతో పాటు నిత్యావసర సరుకుల సరఫరా, వైద్య సేవలకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతులను త్వరగా పునరుద్ధరించాలని సూచించారు. నష్టపోయిన కుటుంబాలను గుర్తించి తక్షణ సహాయం అందించాలని కోరారు.



