అంబేద్కర్‌పై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: కేవీపీఎస్

డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని వికారాబాద్ జిల్లా తాండూర్‌లో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తాండూర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ కోట్లాది అణగారిన వర్గాలకు సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం పోరాట స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. రాజ్యాంగం, రిజర్వేషన్లపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు.



