మల్కాపూర్‌లో TPF టీమ్‌కు స్వాగతం
TG: ఆదిలాబాద్ జిల్లా మల్కాపూర్ గిరిజన గ్రామంలో TPF బృందానికి స్థానిక గోండు గిరిజనులు ఆత్మీయ స్వాగతం పలికారు. ‘బడి కోసం బస్సు యాత్ర’లో భాగంగా గ్రామానికి చేరుకున్న యాత్ర బృందం స్థానిక అంశాలు పరిశీలించింది. స్థానికులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుంది. ప్రభుత్వ బడులపై ప్రజల్లో అవగాహన పెంచుతూ ఇలాంటి గ్రామాల వరకు నాణ్యమైన విద్య అందాలని TPF <a href="https://www.theclearcutnews.com/n/Zqw8ZwC">విద్యా బస్సుయాత్ర</a> ఈనెల 27 వరకు కొనసాగుతోంది.


