నీటి బిల్లు పేరుతో కొత్త మోసం!

TG: జలమండలి (HMWSSB) పేరుతో ఫేక్ SMS, WhatsApp మెసేజ్‌లు వస్తున్నాయి.. జాగ్రత్త! “నీటి బిల్లు పెండింగ్‌లో ఉంది.. వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తాం” అంటూ గుర్తుతెలియని నంబర్ల నుంచి మెసేజ్‌లు పంపుతున్నారు. వీటిలో ఇచ్చిన నంబర్లకు కాల్ చేయొద్దని, APK ఫైల్స్ లేదా అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్/ఇన్‌స్టాల్ చేయొద్దని జలమండలి హెచ్చరించింది. OTP, UPI PIN, బ్యాంక్, కార్డు వివరాలు ఎవరికీ చెప్పొద్దని సూచించింది. సందేహాలుంటే ఆఫిషియల్ కస్టమర్ కేర్ 155313కు కాల్ చేయాలని HMWSSB తెలిపింది.



