← Back to news

పెళ్లి చేసుకున్నంత మాత్రాన స్వేచ్ఛ పోదు: సుప్రీంకోర్టు

By Vishnu· 1h ago
పెళ్లి చేసుకున్నంత మాత్రాన స్వేచ్ఛ పోదు: సుప్రీంకోర్టు

పెళ్లి చేసుకున్నంత మాత్రాన లైంగిక అంశాల్లో మహిళ తన వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంపత్యంలో భార్యపై బలవంతం(Marital Rape) విషయంలో భర్తపై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చన్న కర్ణాటక హైకోర్టు తీర్పుపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఇలాంటి కేసుల్లో భర్తలకు ఉన్న చట్టపరమైన రక్షణలపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వ స్పందనను కోరింది. ఈ అంశంపై తర్వాతి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

More in National