CJP ప్రొటెస్టులో పాల్గొన్నాడని నోటీసులు.. సుప్రీం సీరియస్!

గ్రేటర్ నోయిడాలోని లా స్టూడెంట్ అక్షత్ త్రిపాఠీకి మేజిస్ట్రేట్ రూ.5 లక్షల పర్సనల్ బాండ్‌పై నోటీసు ఇచ్చారు. జులైలో ‘క్రాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP) నిరసనలో పాల్గొన్నాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయితే స్టూడెంట్స్‌పై ఎలాంటి యాక్షన్స్ తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. దీంతో 'నోటీసులు ఇవ్వడానికి మేజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం' ఎలా ఇచ్చారంటూ CJI సూర్యకాంత్ ప్రశ్నించారు. నోటీసును తర్వాత వెనక్కి తీసుకున్నా, దీనిపై జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ఎక్స్‌ప్లనేషన్ కోరాలని కోర్టు తెలిపింది.


