← Back to news

జైలు శిక్ష.. డ్రంక్ అండ్ డ్రైవ్కు భద్రాద్రిలో షాక్!

By samson· 2d ago
జైలు శిక్ష.. డ్రంక్ అండ్ డ్రైవ్కు భద్రాద్రిలో షాక్!

భద్రాద్రి కొత్తగూడెంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌కు కఠిన శిక్ష పడింది. ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో ఇద్దరు మద్యం సేవించి వాహనాలు నడిపారు. వారిపై కేసులు నమోదు చేశారు. 2వ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి రవికుమార్ విచారణ చేశారు. నిందితులకు రెండు రోజుల జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్హెచ్ఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ’’మద్యం తాగి డ్రైవ్ చేస్తే ప్రాణాపాయ ప్రమాదాలు తప్పవు. ఇలాంటి వాళ్లను ఉపేక్షించేది లేదు. తనిఖీలు మరింత విస్తృతం చేస్తామ’’న్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 59m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.