← Back to news

వాంగ్‌చుక్‌కు విదేశాల్లో పెరిగిన మద్దతు

By RK· 22 Jul 2026· New York
వాంగ్‌చుక్‌కు విదేశాల్లో పెరిగిన మద్దతు

ఎడ్యుకేషన్ సిస్టంలో లోపాలపై పోరాడుతూ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌కు అమెరికాలో మద్దతు పెరుగుతోంది. న్యూయార్క్, శాన్‌జోస్ నగరాల్లో ‘హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్’ సభ్యులు ఆయనకు మద్దతుగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేయాలని, ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లండన్, డబ్లిన్‌లలోని భారత కార్యాలయాల వద్ద కూడా నిరసనలు జరిగినట్లు సంస్థ ప్రకటించింది.

వాంగ్‌చుక్‌కు విదేశాల్లో పెరిగిన మద్దతు
వాంగ్‌చుక్‌కు విదేశాల్లో పెరిగిన మద్దతు

More in Politics