అంగన్వాడీ భవనాలపై కమిషన్ ఫోకస్

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య కలెక్టర్, సీపీతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణాలు, స్థల సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. నవంబర్‌లో ‘రాజీవ్ యువ వికాసం’ ఉపాధి పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.



