← Back to news

గద్వాలలో బీజేపీ నేతల హౌస్ అరెస్ట్

By ARJUN· 13h ago· Jammiched, Gadwal, Jogulamba Gadwal
గద్వాలలో బీజేపీ నేతల హౌస్ అరెస్ట్

గద్వాల్ పట్టణంలో బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు జూరాల డ్యామ్‌ పర్యటన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా బీజేపీ యువ నాయకురాలు డీకే స్నిగ్ధారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండ్ల వెంకటరాములు, నాయకుడు వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు పలువురిని వారి నివాసాల్లోనే పోలీసులు నిర్బంధించారు. దీనిపై డీకే స్నిగ్ధారెడ్డి పోలీసుల తీరును ప్రశ్నించారు. రైతులకు సాగునీరు ఇవ్వకుండా నీటి కోసం ప్రశ్నిస్తే అరెస్టు చేయడం ఏంటని ఫైర్ అయ్యారు.

గద్వాలలో బీజేపీ నేతల హౌస్ అరెస్ట్
గద్వాలలో బీజేపీ నేతల హౌస్ అరెస్ట్

More in Local