'విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'

మంచిర్యాల జిల్లాలో ఇవాళ జరిగిన సింగరేణి కార్మిక గర్జన సభలో విశ్రాంత ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని BRS, BGKS నాయకులను కోరారు. 1998 ఒప్పందం ప్రకారం పెంచాల్సిన కోల్ మైన్స్ పెన్షన్ 28 ఏళ్లుగా పెరగకపోవడంతో సుమారు 80 వేల మంది విశ్రాంత ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెన్షన్ పెంచి సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య డిమాండ్ చేశారు. నాయకులు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.


