అర్హత ఉన్నా.. అందని పెన్షన్

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం ఎన్ఆర్ పురం పంచాయతీ పరిధిలోని నాయుడు వలసలో ఎనిమిదేళ్ల గిరిజన దివ్యాంగ బాలికకు ప్రభుత్వ సాయం అందడం లేదు. కోటపర్తి గంగులు, సీతమ్మ దంపతుల కుమార్తె చిన్నప్పటి నుంచి కాళ్లు, చేతులు కదలక, మాటలు రాక, మేధోపరమైన వైకల్యంతో బాధపడుతోంది. సదరం సర్టిఫికెట్ ఎక్కడ తీసుకోవాలో తెలియక పెన్షన్కు దరఖాస్తు చేయలేకపోయామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.



