ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యం : MLA
విజయనగరం జిల్లా రాజాంలో మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీను (చిన్న శ్రీను) చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావును కలిశారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. భోగాపురం ఎయిర్పోర్ట్ రాకతో ఉత్తరాంధ్ర వెనుకబాటు తొలగిపోతుందని ఆయన అన్నారు. యువ నాయకుడు చిన్న శ్రీను TDPలో చేరడంతో పార్టీకి బలం పెరిగిందని తెలిపారు. చిన్న శ్రీను మాట్లాడుతూ.. రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం సీనియర్ నాయకులతో కలిసి పనిచేస్తామని చెప్పారు.



