← Back to news

గురజాడ సాహిత్య సేవలు చిరస్మరణీయం: లోకేశ్

By KUCHIPUDI BUJJIBABU· 20h ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur
గురజాడ సాహిత్య సేవలు చిరస్మరణీయం: లోకేశ్

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అంటూ దేశభక్తి, మానవతా విలువలను చాటిచెప్పిన గురజాడ సాహిత్య సేవలను, సమాజ సంస్కరణకు ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా మంత్రి స్మరించుకున్నారు. తెలుగు సాహిత్యంలో గురజాడ రచనలు చిరస్థాయిగా నిలిచాయని, ప్రజల్లో చైతన్యం, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో ఆయన సాహిత్యం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.

More in Local