అలర్ట్.. రెండు రోజులు నీటి సరఫరా బంద్

శ్రీకాకుళం నగరంలో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. నగరపాలక సంస్థ పరిధిలోని 1 నుంచి 50 వార్డులకు ఈ నెల 15, 16 తేదీల్లో నీటి సరఫరా నిలిచిపోనుందని కమిషనర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. గొంటి వీధి వద్ద వాటర్ పైప్లైన్ మరమ్మతులు చేపట్టనున్న దీంతో ఈ అంతరాయం ఏర్పడుతుందని వెల్లడించారు. ప్రజలు ముందుగానే నీటిని నిల్వ చేసుకుని సహకరించాలని కోరారు.


