కరుణాకర్ కుటుంబానికి మిత్రుల ఆర్థిక భరోసా

TG: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం వేదనగర్‌కు చెందిన స్వర్గీయ కరుణాకర్ కుటుంబాన్ని ఆయన చిన్ననాటి స్నేహితులు సోమవారం పరామర్శించారు. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులు తమ గ్రూపులోని సభ్యుల నుంచి సేకరించిన రూ.30 వేల ఆర్థిక సాయాన్ని కరుణాకర్ కుమారులకు అందజేశారు. భవిష్యత్తులోనూ కుటుంబానికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బిక్షపతి, నాగరాజు, మోహన్, ప్రవీణ్, శంకర్, రాజేష్, రాజేందర్, సాగర్, సతీష్, మహేందర్, భాస్కర్, స్వామి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.



