అనంతగిరిలో ఎంపీటీసీ సభ్యులకు సన్మానం

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తడబారికి మితుల అధ్యక్షతన ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర పాల్గొన్నారు. గత ఐదేళ్లలో అనంతగిరికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. 2021-26 పదవీకాల ఎంపీటీసీ సభ్యుల సేవలను గుర్తిస్తూ శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గంగరాజు, ఎంపీడీవో ప్రభాకర్, ఎంఆర్ఓ వీరభద్రచారి, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.



