పిడుగుపడి ఆరు గేదెలు మృతి

నిర్మల్ జిల్లా కౌట్లకే గ్రామంలో భారీ వర్షంతో పాటు పిడుగుపడింది. సిద్దులకుంట రోడ్డులోని పశువుల మందపై పిడుగు పడటంతో ఆరు గేదెలు అక్కడికక్కడే చనిపోయాయి. ఈ ఘటనతో ఊరిలో తీవ్ర విషాదం నెలకొంది. తమ జీవనోపాధి కోల్పోయిన బాధిత పశువుల యజమానులను గవర్నమెంట్ ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.



