డ్రైనేజీలు పొంగి.. రోడ్లపైకి చేరిన వర్షపు నీరు

భారీ వర్షాలతో తిరుపతి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతి జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో నీరు రోడ్లపైకి చేరింది. అండర్‌బ్రిడ్జిల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షం కొనసాగడంతో నగరంలోని ప్రధాన మార్గాల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.



