← Back to news

ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి: ఏబీవీపీ

By DK· 16h ago
ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి:  ఏబీవీపీ

కడప జిల్లా పోరుమామిళ్లలో ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదల కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించి బకాయిలను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఏబీవీపీ కడప విభాగ్ కన్వీనర్ అభిలాష్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.6,800 కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. సకాలంలో నిధులు అందక విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

More in Local