కంపెనీ ఇచ్చే ఉచిత ఇన్సూరెన్స్‌ని నమ్ముకుంటే కష్టమే!

చాలామంది కంపెనీలు ఉచితంగా ఇచ్చే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ (GTL) ఉంది కదా అని కూల్ అయిపోతారు. కానీ అది అసలు సరిపోదు! మీరు ఏడాదికి ₹50 లక్షలు సంపాదిస్తే, కంపెనీ కేవలం ₹30 లక్షల కవర్ ఇచ్చిందనుకోండి.. ఏమైనా రిస్క్ జరిగితే మీ ఫ్యామిలీకి ఆ డబ్బులు దేనికి సరిపోవు. పైగా ఈ ఇన్సూరెన్స్ మీరు ఆ కంపెనీలో ఉన్నంతవరకే పనిచేస్తుంది. జాబ్ మారితే అట్టే పోతుంది! అందుకే సొంతంగా ఒక టర్మ్ ప్లాన్ ఉండటం మస్ట్. అలాగే ఆఫీస్ రికార్డ్స్‌లో మీ నామినీ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి భయ్యా!
