‘ఏమైపోతున్నాయి ఆప్యాయతలు?’..కదిలించిన సజ్జనార్ పోస్ట్
హరియాణా రాష్ట్రం సోనిపట్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త వృద్ధాశ్రమంలో మరణించారు. కుమార్తెలు కన్నతండ్రి అంత్యక్రియలను రాలేక వీడియో కాల్ ద్వారా చూస్తూ సరిపెట్టుకున్నారు. తండ్రి చివరి కార్యాల ఖర్చుల కోసం రూ.5 వేలు పంపించారు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి అని ప్రశ్నించారు. ఈ పోస్ట్ ఎంతోమందిని కదిలిస్తోంది.

