సాహితీ లోకానికి తీరని లోటు

TG: ప్రముఖ తెలుగు రచయిత ముదిగొండ శివప్రసాద్ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ హాస్పిటల్‌లో నిన్న రాత్రి కన్నుమూశారు. 1940లో ప్రకాశం జిల్లాలో జన్మించిన ఆయన.. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు. ‘ఆవాహన’, ‘శ్రీలేఖ’, ‘శ్రావణి’, ‘తంజావూరు విజయం’, 'సగం విరిగిన చంద్రుడు' వంటి చారిత్రక నవలలతో గుర్తింపు పొందారు. చరిత్రను సజీవమైన కథగా పాఠకులకు అందించడమే ఆయన ప్రత్యేకత. ఆయన మరణం తెలుగు సాహితీ లోకాన్ని విషాదంలో ముంచేసింది.



