ఈ నెల 26 వరకు సముద్రంలోకి వెళ్లొద్దు

భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో మత్స్యకారులు ఈ నెల 26వ తేదీ వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండల ప్రత్యేక అధికారి పి.వేణుగోపాల్ తెలిపారు. రానున్న రెండు రోజుల్లో వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీరప్రాంతాల్లోని పూరిళ్లు, పాత భవనాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 8 గ్రామాల్లో పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని చెప్పారు.



